Tuesday, 13 January 2026

అమ్మా.. నాన్న.. నేను..బుర్రా వెంకటేశం IAS

 అమ్మా.. నాన్న.. నేను..బుర్రా వెంకటేశం IAS


 

అమ్మలోని అనురాగం నేను

నాన్నకు అపురూపం నేను

అమ్మలోని చక్కదనం నేను
నాన్నలోని చురుకుదనం నేను

అమ్మలోని ఆత్మీయత నేను
నాన్నలోని గాంభీర్యత నేను

అమ్మలోనీ ప్రావీణ్యత నేను
నాన్నలోని ప్రాధాన్యత నేను

అమ్మలోని దీప్తిని నేను
నాన్నలోని వ్యాప్తిని నేను

అమ్మలోని బంధం నేను
నాన్నలోని అభయం నేను

అమ్మలోని భక్తిని నేను
నాన్నలోని శక్తిని నేను

అమ్మలోని యుక్తిని నేను
నాన్నలోని ఆసక్తిని నేను

అమ్మలోని ప్రశాంతం నేను
నాన్నలోని ఆసాంతం నేను

అమ్మ రక్తమాంసాల రూపం నేను
నాన్న చెమటచుక్కల ఆనందం నేను

అమ్మలోని చింతను నేను
నాన్నలోని స్వాంతన నేను

అమ్మలోని ఆలోచన నేను
నాన్నలోని ఆచరణ నేను

అమ్మ లోకానికి ఇచ్చిన
సంస్కృతి పరిరక్షణ నేను
నాన్న జగతికి చేసిన
సమసమాజ కల్పన నేను…

No comments:

Post a Comment

అమ్మ కోసం ఐఏఎస్.. | IAS Burra Venkatesham Inspirational Story

                         అమ్మలోని అనురాగం నేను నాన్నకు అపురూపం#-బుర్రా వెంకటేశం, ఐఏఎస్‌ అమ్మలోని అనురాగం నేను నాన్నకు అపురూపం నేను అమ్మలోని ...