Friday, 29 January 2021

Amma Paata || Zee Sarigamapa fame || Sai Veda Vagdevi || MusicHouse 27

అమ్మను ప్రేమించే వాళ్ళ కోసం అమ్మ పాట

అమ్మ pdf book by k.venkata rama krishna

 

అమ్మపాట

 



అమ్మపాట

అమ్మానను కన్న బుణము తీరేదెలమ్మా

భూదేవి కన్న గొప్ప గుణము నీదేకదమ్మా

కంటి పాపవు అయినవు

నా ఇంటికి దీపానివి అయినవు

జన్మకి మరుజన్మనిచ్చిన అమ్మా

నాలో జీవాత్మ వైనవమ్మా. || అమ్మా"


నవమాసాలు నీ కడుపున మోసావు

నీ ప్రాణాన్ని ఎరువుగా పోసావు

పెరిగే బరువును మోసినావమ్మా

నాకు ప్రేమతోనే జన్మ నిచ్చినవమ్మా. || అమ్మా"



పురిటి నొప్పుల్లోనే అమ్మా

నీ ఒళ్ళెంతో పుండైనది అమ్మా

బిడ్డకు నీవు జన్మ నివ్వ అమ్మా

నీ నిండు మనసు కోరుతుంది అమ్మా. || అమ్మా"


నెత్తురు ముద్ద అని అమ్మా

నను ఎత్తుకుని ముద్దాడి అమ్మా

అరిచేతుల్లో పెంచావు అమ్మా

కంటిరెప్పగ చూసావు అమ్మా

ఏమిచ్చి ఋణము తీర్చుకోనె అమ్మా

నీకు ఏసేవలు చేయనె మాయమ్మా.|| అమ్మాll


చను పాలతోనే శ్వాస పోసినావు

నాభావాలకు భాషవైనావు

జన్మకి మరుజన్మ నిచ్చినవమ్మా

నాలో సగభాగమైన అమ్మా

అరనిమిషమైన బిడ్డ అలిగితె అమ్మా

ఆ తల్లి గుండె తల్లడిల్లె నమ్మా

అలిగిన ఆవేళలోనె అమ్మా

ఆ అందాల చందమామ అమ్మా

అతడే నీకు మేన మామంటివమ్మా.|| అమ్మాll


కన్నతల్లి ప్రేమే మా అమ్మా

అది వెన్న కన్న మెత్తని మాయమ్మా

కన్న తల్లి మనసేమా యమ్మా

అది మల్లె కన్న తెల్లనె మాయమ్మా

డిల్లికి రారాజైనా అమ్మా

ఆ తల్లికి ముద్దుల కొడుకేనమ్మా

అరవై ఏండ్ల బిడైనా అమ్మా

ఆ తల్లికి అడ్డబాలే నమ్మా

ఏమిచ్చి ఋణము తీర్చుకోనె అమ్మా

నీకు ఏ సేవలు చేయనెమాయమ్మా

జన్మంతా సేవచేసిన గానమ్మా

నీ ఋణము తీర్చుకోలేను అమ్మా || అమ్మాll


స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..   *స్నేహం* ఓ మధురమైన అనుభూతి.  దీనికి వయసుతో నిమిత్తం లేదు.  ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు  ...