Saturday, 31 October 2020

Amma kavi donkena Sri shailam

 

Amma kavi donkena Sri shailam 

అమ్మకవి డొంకెన శ్రీశైలం
Posted On:12/5/2014 1:28:53 AM
డొంకెన శ్రీశైలం సహజకవి. ప్రాథమికంగా అమ్మకవి. అమ్మను మాతృమూరిగానే కాదు, అపర దేవతగా గౌరవించి పూజించిన కరుణామయుడు. మాయా, మర్మాలెరుగని సహృదయమూర్తి. హమేశా తన హాస్యోక్తులతో కడుపుబ్బ నవ్వించిన హాస్య ప్రియుడు. అమ్మ విశ్వరూపం, అమ్మనెనరు, అమ్మ తనం, అనితరసాధ్యమైన అమ్మ గుణాన్ని కవిత్వీకరించిన వాడు డొంకెన. మరొక పక్క, రైతులోక బాంధవుడై ఈ కవి- రైతు ఆత్మను పట్టుకోగలిగి మరణ సదృశ్యంగా మారిన రైతు వెతలను కవిత్వం చేసి కన్నీరుపెట్టాడు. జీవిత మాసాంతం అరిగోస పాలైన రైతు, ఆఖరుకు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు, ఆ పాపం- దేశానిదా? దేవునిదా అని ఆకాశమంతటి ఆవేదనతో ఏలికలను ప్రశ్నించాడు. నేతన్న పోగుల పేగులు తెగిన సవ్వడి ని విన్పించాడు. నిలువెత్తు మానవత్వాన్ని తనదైన శైలితో ఎలుగెత్తి చాటినా డు. శబ్ద శిల్పిగా పరిణతి నొందిన అతని సాహిత్య సేవారంగమంతా సృజనశీలురమయమే అయ్యింది. కనుకనే పసిపాపల చిరునవ్వుతో విశ్వశాంతి కోసం నిరంత రం తపించాడు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించటమంటే తనకు ఆకలి కడుపులో అమృతం కురిసినట్లుందని పరమానంద భరితుడైనాడు. పసిపాపగా కేరింతలు పెట్టినారు. డొంకెనది అహరహం స్త్రీల పట్ల ఆవ్యాజమైన గౌరవ దృక్పథం. ఆమె ఎత్తు ఆకాశమంతటిదన్నడు. ఈలోకంలో అద్భుతమైన అమ్మ నడక ఆగలేదు అని నినదిస్తూ నిలిచాడు. రైతన్న గుండెదడను, నేతన్న పోగుల పేగులు తెగిన సవ్వడిని తన కవిత్వంతో వినిపిస్తూ కష్టాలు, కన్నీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమై కవితలల్లాడు. ఆయన పలుకుల్లో మాండలిక పదాలు, పలుకుబడులకు లోటుండక అవి తొణిసలాడుతూ వస్తాయి. అందుకే ఆతని తొలి కవితా సంపుటి అమ్మను భవనగిరిలోనే ఆవిష్కరించిన ప్రజాకవి కాళోజీ- అతనివి విద్యాలయాల్లో చదివిన చదువులు గాక (బడిపలుకులు గాకుండా) పలుకుబడులను (పామర జనరంజకాలని) శ్లాఘించాడు. గుడిసె మన తొలి నీడ అని పొయ్యి మనకు పూర్వీకులిచ్చిన ఆగ్నిహోత్రమని, అడవే అంతిమంగా అందివచ్చే దేశసంపదని, ఎరుకజేస్తూ అనేక కవిత లల్లాడు. అమర శిల్పం ముందు ఎవరెస్టు శిఖరమైనా తలవంచుతుందని సగర్వంగా ప్రకటించిన కవి శ్రేష్టుడు డొంకెన.
నిన్న(డిసెంబర్ 4)ఉదయమే ఈ ప్రపంచానికి వినమ్రంగా వీడ్కోలు పలికి, తన ఆత్మీయ కవితా ప్రపంచావరణాన్ని మిత్రుల కు, అనుచరులకు అప్పగించిన అమర కవి.అమ్మనే సర్వవ్యాప్తం అన్న డొంకెన శ్రీశైలంగారికి అశ్రునయనాలతో... వీడ్కోలు!

Friday, 16 October 2020

Amma prema pdf book

 Amma prema pdf book Link: 

https://drive.google.com/file/d/1WaDnefnBxhOFwks03mHaUHCMefNSlB3L/view?usp=drivesdk





AMMA pdf book

 AMMA pdf book Link: 

https://drive.google.com/file/d/1wO5CnGLeqE0VihF5A_SoAb3DWz-Sa56Z/view?usp=






Chaganti gari words About Amma





Chaganti gari words About AmmA
Video link:
 

MATRU VANDANAM

MATHRUVANDANAM_BAPU BOOK

మాతృవందనం పుస్తకము

Mathruvandanam Bapu Book by ysreddy94hyd



https://www.scribd.com/document/253942692/Mathruvandanam-Bapu-Book

మా అమ్మ గురించి... ఎపిసోడ్ - 01 Dr Gurva Reddy



3



4


అమ్మ

 



స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..   *స్నేహం* ఓ మధురమైన అనుభూతి.  దీనికి వయసుతో నిమిత్తం లేదు.  ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు  ...